జిల్లా కేంద్రంలో సీపీఐ 99వ ఆవిర్భావ వారోత్సవాలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో సీపీఐ 99వ ఆవిర్భావ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం స్థానిక రాంనగర్ కాలనీలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు నళినిరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ దున్నేవాడికి భూమి, పేదలకు ఇంటి స్థలాలు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దేశ స్వాతంత్ర్య సాధనలో, తెలంగాణ ఉద్యమాల్లో కమ్యూనిస్టుల పాత్ర ఎంతో కీలకమని, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఈ నెల 26వ తేదీన సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

