Home Page SliderInternationalTrending Today

నెదర్లాండ్స్‌లో 550 మంది పిల్లల తండ్రికి కోర్టు షాక్

స్పెర్మ్ దానం చేయడం ఆపాలన్న డచ్ కోర్టు
స్పెర్మ్ దాతలు 12 మంది మహిళలకు దానం చేయాలి
25 మంది పిల్లలకు మించి తండ్రి కాకూడదు
డచ్ మార్గదర్శకాల విరుద్ధంగా స్పెర్మ్ దానం

నెదర్లాండ్స్‌లోని ఒక వ్యక్తి 550 మందికి పైగా పిల్లలకు తండ్రయ్యాడని, అనుమానించిన కోర్టు , ఆ వ్యక్తి స్పెర్మ్‌ను దానం చేయకుండా శుక్రవారం నిషేధించింది. 41 ఏళ్ల జోనాథన్ జాకబ్ మీజర్ అనే వ్యక్తి మళ్లీ స్పెర్మ్ దానం చేయడానికి ప్రయత్నిస్తే లక్ష యూరోలు 90 లక్షల జరిమామా విధిస్తామని హెచ్చరించినట్టు బీబీసీ పేర్కొంది. ఒక ఫౌండేషన్ హేగ్‌లో దావా వేయడంతో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. సివిల్ కేసును విచారించిన న్యాయమూర్తి, సదరు నిందితుడు గతంలో తనకు పుట్టిన పిల్లల సంఖ్య గురించి కాబోయే తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చాడని పేర్కొన్నారు. ఈ తల్లిదండ్రులందరూ తమ కుటుంబంలోని పిల్లలు, భారీ బంధుత్వ నెట్‌వర్క్‌లో భాగమయ్యారని, వందలాది మంది తోబుట్టువులయ్యారని న్యాయమూర్తి హెస్సెలింక్ తీర్పులో తెలిపారు.

కాబోయే తల్లిదండ్రులను సంప్రదించకూడదని కూడా స్పెర్మ్ దానం చేసిన మీజర్‌ను కోర్టు ఆదేశించింది. మీజర్ స్పెర్మ్‌ను కనీసం 13 క్లినిక్‌లకు దానం చేశాడని.. వాటిలో 11 నెదర్లాండ్స్‌లో ఉన్నాయని తేలింది. డచ్ క్లినికల్ మార్గదర్శకాల ప్రకారం, స్పెర్మ్ దాతలు 12 మంది కంటే ఎక్కువ మంది మహిళలకు దానం చేయకూడదు. 25 మంది పిల్లలకు మించి తండ్రి కాకూడదన్న నిబంధనలున్నాయి. వందలాది మంది తోబుట్టువులు ఉన్నారని తెలుసుకున్న తర్వాత పిల్లల్లో ప్రమాదవశాత్తూ సంతానోత్పత్తి, మానసిక సమస్యలు తలెత్తకుండా నిరోధించడం కోసం ప్రభుత్వం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చింది.

అయినప్పటికీ, మీజర్ 2007లో స్పెర్మ్‌ను దానం చేయడం ప్రారంభించినప్పటి నుండి 550 మరియు 600 మంది పిల్లలను ఉత్పత్తి చేయడంలో సహాయం చేశాడు. 2017లో, నెదర్లాండ్స్‌లోని ఫెర్టిలిటీ క్లినిక్‌లకు దానం చేయకుండా నిషేధించబడ్డాడు. అంతటితో ఆగకుండా విదేశాల్లో, ఆన్‌లైన్‌లో స్పెర్మ్‌ను దానం చేస్తున్నట్టు విచారణలో తేలింది. కోర్టు కేసులో ఉన్న పిల్లలలో ఒకరి తల్లి మాట్లాడుతూ, ఇతర దేశాలకు పాకిన మీజర్ స్పెర్మ్ దానం ప్రక్రియను అడ్డుకున్నందుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే, గర్భం దాల్చలేని వారికి సహాయం చేసేలా తీర్పు ఇవ్వాలని దాత తరుపు న్యాయవాది కోర్టును కోరారు. వృత్తి రీత్యా సంగీతకారుడైన మీజర్ ప్రస్తుతం కెన్యాలో నివసిస్తున్నాడు