కొత్త ఇంట్లోకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. అంతేకాదు అక్కడే కొత్త కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఆగ్నేయ దిల్లీలోని తూర్పు నిజాముద్దీన్ ప్రాంతంలో తన నివాసాన్ని, కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. ఎంపీగా అనర్హత వేటు పడడంతో ఆయన చాలాకాలంగా నివసిస్తున్న 12, తుగ్లక్ లేన్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. దీనితో ప్రస్తుతానికి తన తల్లి సోనియా గాంధీ అధికారిక నివాసమైన 10, జనపథ్‌లో ఉంటున్న రాహుల్ మరో చోటుకు తన నివాసాన్ని, కార్యాలయాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

దీనితో మాజీ దిల్లీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత షీలా దీక్షత్ ఇంటిని దీనికోసం ఎంపిక చేసుకున్నారు. ఆమె మరణానంతరం ఆమె తనయుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ఆ ఇంటిలో ఉండడం లేదు. అందుకు ఆ ఇల్లు ఖాళీగానే ఉన్నట్లు సమాచారం.