NationalNews

భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ నేత కన్నుమూత

కాంగ్రెస్‌ సేవాదళ్‌ నేత కృష్ణ కుమార్‌ పాండే మంగళవారం మహారాష్ట్రలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో పాల్గొనే సమయంలో మృతి చెందారు. పాండే గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ అట్టడుగు ఫ్రంట్‌ సంస్థ అయిన కాంగ్రెస్‌ సేవాదళ్‌కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పాండే జాతీయ జెండా పట్టుకుని యాత్రలో నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారని.. ఆయనను హుటా హుటిన ఆసుపత్రికి తరలించామని అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారని కాంగ్రెస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

పాండే కుప్పకూలిన సమయంలో పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో పాటు చేతిలో జెండా పట్టుకుని కొద్ది దూరం నడిచిన పాండే.. తిరిగి వెనక్కి వెళ్లిపోయారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ… పాండే మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పాండే మరణం యావత్‌ కాంగ్రెస్‌ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.