కర్నాటకను దేశం నుంచి విడదీయాలని కాంగ్రెస్ ఆలోచన, మోదీ సంచలన ఆరోపణ
కర్నాటకను దేశం మొత్తం నుంచి విడదీయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ప్రధాని చివరి ప్రచార కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేయడంలో కాంగ్రెస్ పార్టీ రాజకుటుంబం ముందుంది. విదేశీ శక్తులు భారత రాజకీయాలను దోచుకోవాలని బహిరంగంగా కోరుకుంటున్నారని ఆక్షేపించారు. మే 10న కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు ముందు, ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు.
మేఘావృతమైన వాతావరణం ఉన్నప్పటికీ, రహదారికి ఇరువైపులా గుమికూడి ఉన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు మోదీకి స్వాగతం పలికారు. న్యూ తిప్పసంద్ర రోడ్డులోని కెంపేగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు దాదాపు గంటన్నరలో 8 కిలోమీటర్ల రోడ్‌షో మోదీ నిర్వహించారు. ఈసారి రాష్ట్రంలో ప్రజలు మెజారిటీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని శివమొగ్గలోని చెప్పారు. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈ ఎన్నికలు చరిత్ర సృష్టించనున్నాయన్నారు.