NewsNews AlertTelangana

మునుగోడులో కాంగ్రెస్‌కు 3-4 వేల ఓట్లే

మునుగోడు సిట్టింగ్‌ స్థానాన్ని దక్కించుకోవడం కాంగ్రెస్‌ పార్టీకి అసాధ్యంగా కనిపిస్తోంది. అక్కడ త్వరలో జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ 3-4 వేల కంటే ఎక్కువ ఓట్లు సాధించే అవకాశమే లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. తాను మునుగోడులో కాంగ్రెస్‌ తరఫున ప్రచారానికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నతన ప్రాధాన్యతను తగ్గించి.. మరో పార్టీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు.

రేవంత్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తేనే పార్టీ తరఫున ప్రచారం చేస్తానని మెలిక పెట్టారు. మునుగోడుపై ప్రియాంక గాంధీతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొనలేదు. మాణిక్కం ఠాగూర్‌ స్థానంలో కమల్‌నాథ్‌ వంటి అనుభవం కలిగిన నాయకుడిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా నియమించాలని డిమాండ్‌ చేశారు. తాను మాత్రం పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు.