ఈసీ వెబ్‌సైట్‌లో గందరగోళం, కాంగ్రెస్‌లో అనుమానం
హర్యానా ఎన్నికల ఫలితాలు వెల్లడిలో జాప్యంపై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ నేత జైరాం రమేష్ తెలిపారు. ఎన్నికల డేటాను అప్‌లోడ్ చేయడం, ప్రచురించడం ఆలస్యం జరుగుతోందని ఆ పార్టీ గుప్పించింది. “మేము ఫిర్యాదు చేస్తున్నాము. EC మా ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని ఆశిస్తున్నాం. 10-11 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి… కానీ సైట్‌లో కేవలం నాలుగు నుండి ఐదు రౌండ్లు మాత్రమే అప్డేట్ చేశారు” అని ఆయన వార్తా సంస్థ ANIకి తెలిపారు. “లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే, హర్యానాలో ఈసీ తాజా ట్రెండ్‌లను అప్‌లోడ్ చేయడంలో ఆలస్యాన్ని మళ్లీ చూస్తున్నాం.” అన్నారు. “నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు…” అని ANIతో మాట్లాడుతూ, “మైండ్ గేమ్ ఆడుతున్నారు. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మేము హర్యానా గెలుస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.” అని చెప్పారు. దీనికి బీజేపీ నేత సుధాన్షు త్రివేది కౌంటరిచ్చారు. “కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌పై వేళ్లు వేయడం ప్రారంభించినట్లయితే, వారు ఓటమిని అంగీకరించినట్లు మనం అర్థం చేసుకోవాలి…” అని అన్నారు.