కేజ్రీవాల్ ఇంటి ముందు ఆందోళనలు
ఆప్ నేత కేజ్రీవాల్ ఇంటి ముందు ఇమామ్‌లు ఆందోళనలు చేస్తున్నారు. గత 17 నెలల నుండి వారికి జీతాలు రావడం లేదని వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్యల పరిష్కరం కోసం వారు 6 నెలలుగా పోరాడుతున్నామని వారు పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని, గవర్నర్, మంత్రులను కలిసామని అయినా తమ సమస్యలు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ పూజారులకు, గురుద్వారాల్లో గ్రంథీకులకు నెలకు రూ. 18 వేల జీతం ఇస్తామని ప్రకటించారు. దీనితో తమకు కూడా జీతం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.