తెలంగాణాలో ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే
రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే బుధవారం నుంచి లాంఛనంగా ప్రారంభమైంది. దీన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఇందులో భాగంగా తొలి 3 రోజుల పాటు ప్రతీ ఇంటికి స్టిక్కర్లు వేయనున్నారు. 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ చొప్పున మొత్తం 87,900 మందిని నియమించామని పొన్నం తెలిపారు.అయితే ఈ సర్వేకి ఆధార్ కార్డు ఏమీ ప్రామాణికం కాదని, దీని పట్ల ఎవరు అపోహలు సృష్టించినా నమ్మొద్దని పొన్నం సూచించారు.రాజకీయ ప్రాధాన్యత రిజర్వేషన్లు,కులగణన చేసేందుకే ప్రధానంగా ఈ సర్వే ని ప్రవేశ పెట్టిన సంగతి అందరికి తెలిసిందే.

