Breaking NewscrimeHome Page SliderTelangana

సీఎం రేవంత్ పై ఫిర్యాదు

ఫార్ములా ఈ రేసు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేసు న‌మోదు చేయాల‌ని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.ఈ మేర‌కు ఆయ‌న నార్సింగి పోలీస్ స్టేష‌న్‌కి వ‌చ్చి ఎస్‌.హెచ్‌.వోకి లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. తాను రాజకీయాల్లో రాకముందు ఐపీఎస్ అధికారిగా, క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా, అడిషనల్ డీజీపీగా, వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా ఐక్యరాజ్యసమితిలో పనిచేశాన‌ని చెప్పుకొచ్చారు.రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల…ఫార్ములా ఈ రేసులో జ‌ర‌గ‌ని అవినీతిని పేపర్ మీద పెట్టి అనవసరంగా తెలంగాణకు నష్టం జరుపుతున్నాడని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఈ వ్య‌వ‌హార తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.