Home Page SliderTelangana

తెలంగాణాలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

Share with

తెలంగాణా రాష్ట్రంలో ఇవాళ పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. కాగా తెలంగాణా విద్యాశాఖమంత్రి సబిత ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుండి జరిగిన పదవ తరగతి పరీక్షలకు 4.84 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా వీరిలో 86.60% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 84.68% గా ఉండగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 88.53% శాతంగా ఉంది. అంతేకాకుండా ఈసారి 2,793 స్కూల్స్‌లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు.అయితే 25 స్కూల్స్ ‌లో ఒక్కరూ కూడా పాస్ కానట్లు తెలుస్తోంది. 10 వ తరగతి పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా.. 59.46% ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలించింది.  తెలంగాణాలో నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించిగా..ఇవాళ విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కూడా బాలికలు సత్తా చాటారు.