NationalNewsNews Alert

ముంబైలో కుప్పకూలిన భవనం

మహరాష్ట్ర రాజధాని,దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో ఒక భవనం కుప్పకూలింది. నగరంలోని ఈ 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్ప కూలి పోవడంతో అక్కడి స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనలో ఆ భవనంలో ఉన్న కొందరు శిథిలాల క్రింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.  అయితే ముంబైలోని బోరీవాలీ ప్రాంతంలో సాయిబాబా మందిర్ ప్రక్కన ఈ ఘటన చోటుచేసుకుంది.

దీనిపై ముంబైలోని బృహన్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు స్పందించారు. అధికారులు దీని గురించి మాట్లాడుతూ..బోరీవాలీ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయిందనే సమాచారం తమకు వచ్చిందన్నారు. దీంతో తాము అంతా వెంటనే స్పందించి ఘటనాస్థలానికి 8 ఫైర్ ఇంజన్లను పంపించామన్నారు. ప్రస్తుతం శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో భవనం కూలుతుండగా తీసిన ఫోటోలు ,వీడియోలు సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయగా అవి కాస్త వైరల్‌గా మారాయి.