రేపు సీఎం కుప్పం టూర్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ను కలెక్టర్ సుమిత్ కుమార్ ఇవాళ ఒక ప్రకటనలో తెలియజేశారు. రేపు మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి 12.30 గంటలకు గుడిపల్లి మండలం ద్రవిడ యూనివర్సిటీ చేరుకుంటారు. 12.50 గంటలకు కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవ స్థానానికి స్థానానికి చేరుకుని జాతరలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.40 గంటలకు ద్రవిడ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుని హెలికాప్టర్ లో బెంగళూరు విమానాశ్రయం తిరుగు ప్రయాణం అవుతారు.

