NHAI ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు ఇవాళ తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ రహదారుల విస్తరణలో రాష్ట్ర సహకారంపై సీఎంతో చర్చించారు.ఈ క్రమంలో వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో దీనిపై రేపు 11 గంటలకు సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కాగా సమావేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతోపాటు జిల్లాల కలెక్టర్లు,అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

