సీఎం రేవంత్ …మూసి పాదయాత్ర ప్రారంభం
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర శుక్రవారం మథ్యాహ్నం 3.30 కి ప్రారంభం అయ్యింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అభివృద్దిపై సమీక్ష జరిపారు.అక్కడ నుంచి నేరుగా సంగెంకు చేరుకుని యాత్ర ప్రారంభించారు.ఈ సందర్భంగా స్థానికులు ,మూసి నది పరిరక్షణ సాధన కమిటి సభ్యులు,మంత్రులు,ఎమ్మెల్యేలు,అధికారులు పాల్గొని సీఎం రేవంత్ కి సాదరస్వాగతం పలికారు.స్థానికులు,రైతులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఆయన యాత్ర ప్రారంభించారు.

