Home Page SliderTelangana

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్ నామినేషన్

గజ్వేల్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో నామినేషన్ వేశారు. గజ్వేల్‌లోని సమీకృత భవనంలో రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన అందజేశారు. నామినేషన్ అనంతరం కేసీఆర్ ప్రచార వాహనం పైనుండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కామారెడ్డిలోనూ పోటీచేస్తున్న కేసీఆర్.. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ కూడా నామినేషన్ వేస్తారు.

సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ నామినేషన్ వేశారు.

@KTRBRS