ఏపీలో చుక్కల భూముల రైతులకు గుడ్‌న్యూస్
ఏపీ సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కాగా రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న రైతుల సమస్యను పరిష్కరించేందుకు ఆయన నడుం బిగించారు. అదేంటంటే ఏపీలో చుక్కల భూములున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ఆయన పరిష్కరించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ రేపు కావలిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఉదయం 10:30 నిమిషాలకు కావలి చేరుకుంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.అనంతరం రాష్ట్రంలో ఉన్న చుక్కల భూములను 22A నిషేదిత జాబితా నుంచి తొలగించి రైతులకు హక్కు కల్పించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. దీంతో రాష్ట్రంలో సొంత భూమి ఉండి కూడా అమ్ముకునేందుకు వీలులేక ఇబ్బంది పడుతున్న వేలాదిమంది రైతులకు మేలు జరుగుతుంది. అయితే సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు రేపు ఉదయం 8:30కు విజయవాడ ఇందిరా స్టేడియంలో జరిగే శ్రీ లక్ష్మి మహా యజ్ఞంలో పాల్గొననున్నారు.

