అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. కాగా సీఎం ప్రజావేదిక నుంచి తన పర్యటనను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో గతంలో వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదికను చంద్రబాబు పరిశీలించారు. కాగా 2019 తర్వాత నిలిచిపోయిన భవన నిర్మాణాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. వీటితో పాటు సీఎం రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్,జడ్జిల క్వార్టర్స్, ఆలిండియా సర్వీస్ అధికారుల క్వార్టర్స్ పరిశీలించనున్నారు. అంతేకాకుండా రాయపూడిలోని మినిస్టర్స్ క్వార్టర్స్ పరిస్థిని కూడా సీఎం సమీక్షించనున్నారు. సీఎం పర్యటన అనంతరం అమరావతిలో జరిగిన డ్యామేజీపై ఎన్క్వైరీ చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. కాగా ఈ రోజు మధ్యహ్నం ఒంటిగంటకు సీఎం అమరావతి పర్యటనపై మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు అమారావతి ఫ్యూచర్ ప్లాన్‌పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

