ప్రజలకు సీఎం క్షమాపణలు
రాష్ట్రంలో ఈ ఏడాదంతా ఉద్రిక్తంగా నడిచింది. దురదృష్టకర సంఘటనలు జరిగాయి. ప్రజలు ఎన్నో అవమానాలు, బాధలు ఎదుర్కొన్నారు. అందుకు రాష్ట్రప్రజలందరినీ క్షమాపణలు కోరుతున్నాను అంటూ ప్రజలకు సారీ చెప్పారు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్. జాతుల మధ్య వైరంతో ఎన్నో అమానవీయ సంఘటనలు, మహిళలపై అఘాయిత్యాలు, హత్యలతో ఈ సంవత్సరంలో అట్టుడికిపోయింది మణిపూర్. కుకీ, మైత్రేయి తెగల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా 225 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మీడియా ఎదుట మాట్లాడారు. రాష్ట్రంలో నమోదైన 12 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లలో 625 మంది నిందితులు అరెస్టయ్యారని, ఎందరో నిర్వాసితులయ్యారని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని, చేదు జ్ఞాపకాలను మరిచిపోయి అన్ని జాతుల వారు కలిసికట్టుగా కొత్త జీవితాలను ప్రారంభించాలని కోరారు.