48 టూరిస్టు కేంద్రాల మూసివేత
జమ్మూకశ్మీర్ లోని పహెల్గాం దాడి తర్వాత 48 టూరిస్టు కేంద్రాలు మూతపడ్డాయి. మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అందులో భాగంగానే కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో 48 కేంద్రాలను మూసివేసినట్లు తెలుస్తోంది. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ లోయలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ శ్రీనగర్, గండర్బల్ జిల్లాల్లో స్థానికేతర వ్యక్తులు, భద్రతా సిబ్బంది, కశ్మీరీ పండిట్లపై లక్ష్యంగా దాడులు చేసే అవకాశముందని తెలిపాయి. ఈ నేపథ్యంలోనే జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. 48 టూరిస్ట్ ప్లేసులను క్లోజ్ చేసింది.