Breaking NewscrimeHome Page SliderPoliticsTelangana

గుడి తలుపులు మూసి మ‌రీ…!

తెలంగాణాలోని భూపాల‌ప‌ల్లి జిల్లా కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో అపచారం జ‌రిగింది.గర్భగుడి లో ప్రైవేట్‌ ఆల్బమ్‌ కోసం షూటింగ్ నిర్వ‌హించ‌డంతో భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.గుడి తలుపులు మూసి మ‌రీ గర్భగుడిలో షూటింగ్ చిత్రీకరణ జ‌ర‌ప‌డంతో ఈ భాగోతం వెలుగులోకి వ‌చ్చింది. దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి మ‌రీ ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ‌టంతో కొంత మంది భ‌క్తులు ఏం జ‌రుగుతుందో అని అనుమానంతో గుడి త‌లుపు సందులో నుంచి చూశారు.దాంతో షూటింగ్ జ‌రుగుతుంద‌ని నిర్దార‌ణ‌కు వ‌చ్చి ఆందోళ‌న చేప‌ట్టారు.ఆల్బమ్‌ షూటింగ్‌ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.షూటింగ్ నిర్వ‌హ‌ణ‌పై దేవాదాయశాఖ అధికారులు ప‌ట్టించుకోపోవ‌డంతో భ‌క్తుల ఆగ్ర‌హ జ్వాల‌లు పెల్లుబుకుతున్నాయి.ఆలయ పవిత్రతను దెబ్బతీశారని భక్తుల ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు.సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్ చేస్తున్నారు.