Andhra PradeshHome Page Slider

పొత్తులు కొలిక్కి.. రేపోమాపో అధికారిక ప్రకటన

Share with

టీడీపీ-జనసేన-బీజేపీ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టుగా కన్పిస్తోంది. ముందుగా చెబుతున్నట్టుగా సీట్ల కేటాయింపుపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి ఎన్నికల బరిలో దిగడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. ఎన్నికల్లో ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నట్టే.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై దీమాతో ఉన్న టీడీపీ, పొత్తు ద్వారానే అనుకున్న లక్ష్యం చేరుకోగలమని భావిస్తోంది. మొదట్నుంచి జనసేనకు 26 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక బీజేపీకి 6 ఎంపీలు 9 ఎమ్మెల్యేలు ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తంగా 35 ఎమ్మెల్యేలు, 9 ఎంపీలను టీడీపీ, బీజేపీ-జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. అంటే టీడీపీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 140 అసెంబ్లీ స్థానాల్లో, 16 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది.

టీడీపీ అధినాయకత్వం, బీజేపీతో పొత్తు కుదరాలని భావిస్తున్న కమలనాథులు వేసుకుంటున్న లెక్క ఇది. అయితే ఇప్పటి వరకు పొత్తు లెక్కలపై బీజేపీ పెద్దల వద్ద ఎలాంటి డిస్కషన్ జరిగినట్టుగా లేదు. ఏపీలో పొత్తు విషయంలో వారు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో చూడాల్సి ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి గుడ్ బై చెప్పిన పలువురు నేతలకు టీడీపీ, జనసేన నుంచి టికెట్ల ఆఫర్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ కేటగిరి కింద కొందరికి టీడీపీలోనూ, మరికొందరికి జనసేనలోనూ, బీజేపీలోనూ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో గతంలో టీడీపీలో కీలకంగా ఉండి, బీజేపీలో ఉన్న నేతలకు టికెట్ల కేటాయింపుపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఇప్పుడు ఎవరు టికెట్ కేటాయిస్తారన్నది కూడా తేలాలి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తిరిగి పోటీ చేస్తారని తెలుస్తోంది. నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలకు టీడీపీ టికెట్లు కేటాయించాల్సి ఉంది.