చిరంజీవికి తమ్ముడు పవన్ బర్త్ డే విషెస్.!
మెగా అభిమానులకి అన్నయ్య అయిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర రీ రిలీజ్ సందర్భంగా ఓ రేంజ్‌లో తన లేటెస్ట్ భారీ చిత్రం “విశ్వంభర” ఫస్ట్ లుక్ కూడా బయటకి వచ్చింది. ఇలా మెగా ఫ్యాన్స్‌కి కావాల్సిన బూస్టప్ అంతా ఓ రేంజ్‌లో వచ్చేస్తుండగా చిరు సోదరుడు పవన్ టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చెప్పిన బ్యూటిఫుల్ విషెస్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. తన మాటలుగా చెబుతూ రికార్డు చేసిన, పోస్ట్ పెట్టిన, ఆపద్బాంధవుడు అన్నయ్య అంటూ మొదటి హెడ్డింగ్ హైలైట్‌గా పెట్టి.. “నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు రెండో కంటికి తెలియకుండా మిగిలిపోయాయి. ఆ గుణమే చిరంజీవిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో! గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా చిరంజీవి గారు ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ణి. తల్లి లాంటి మా వదినమ్మతో పాటు ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను”, అని పవన్ తమ్ముడు అన్నయ్య మీద ప్రేమని తన అభిమానాన్ని చూపించారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.