Andhra PradeshHome Page SliderPolitics

వైసీపీలోనే ఉంటా….సీఎం జగన్ తోనే నా రాజకీయ ప్రయాణం

Share with

వ్యక్తిగత కారణాల వల్ల గత కొన్ని నెలలుగా అందుబాటులో లేకపోవడం జరిగిందని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్బంగా శనివారం, దర్శి పార్టీ ఆఫీస్ లో జరిగిన మీడియా సమావేశం లో ఎమ్మెల్య్ మాట్లాడుతూ…  “గతంలో గడపగడపకు కార్యక్రమంలో గానీ కార్యకర్తలకు గానీ అందుబాటులో ఉండే వాడిని కానీ ఈ రెండున్నరలు నెలల్లో అప్పుడప్పుడు నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొన్న కొన్ని కారణాల వల్ల పూర్తిస్థాయిలో పాల్గొనలేదు, ప్రస్తుతం వ్యక్తిగత కార్యక్రమాలను ముగించుకోవడంతో ఇకపై పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంట” అని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని పత్రికలు, చానల్లో పార్టీ మారబోతున్నట్టు వచ్చిన వార్తలు కల్పిత ప్రచారాలని అన్నారు. ఎన్నికల దగ్గర పడుతుండడంతో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.

“సీఎం జగన్ ఒక గొప్ప నాయకుడు అటువంటి నాయకుడితో కలిసి నిలబడితే బాధ్యతగా మిగిలినట్టు..  అలా నిలబడకుండా తప్పించుకుంటే బాధ్యతలు లేని వ్యక్తులుగా చరిత్ర లో నిలుస్తాము,” అని ఎమ్మెల్య్ అన్నారు . 2019 ఎన్నికలు సీఎం జగన్  కి  అత్యంత ముఖ్యమైనవని అందిరికి తెలిసిందని. అలాంటి సమయంలో దర్శిలో నాకు మద్దతుగా అయన నిలబడ్డారని, గెలిచి ఆయనతో కలిసి కూర్చునేలా సీఎం జగన్ ప్రోత్సహించారు అని ఎమెల్య అన్నారు.   ఇకపై కూడా సీఎం జగన్ చెప్పినట్టు వారి అడుగుజాడల్లో నడుస్తానని ఆయనకు నా పైన నమ్మకం నాకు ఆయనపై నమ్మకం ఉందని తెలిపారు. నాకు ఎటువంటి అవకాశం వచ్చినా కూడా దర్శి ప్రాంత ప్రజలకు మంచి చేశానని,  ముఖ్యంగా గడపగడపకు కార్యక్రమంలో ప్రభుత్వము అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్తున్నాము అని అన్నారు.

అలానే కొన్ని రోజుల కిందటే జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మెలో 352 ఎంఓయూలు, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు,   6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. వీటన్నిటిని చూస్తే సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధిని సమాన ప్రతిపాదికన ముందుకు తీసుకు వెళ్తున్నారని అన్నారు.