చిరంజీవికి బ్రిటన్ పురస్కారం
మెగాస్టార్ చిరంజీవికి దేశంలోని అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఖ్యాతి ప్రపంచదేశాలలో కూడా వ్యాపిస్తోంది. తాజాగ బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన సినీరంగానికి అందిస్తున్న విశేష సేవలను గుర్తించి యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఈ వేడుక మార్చి 19న జరగనుంది.