InternationalNews

ప్రపంచ వ్యాప్తంగా చైనా పోలీస్ స్టేషన్లు…

ప్రపంచాన్ని కబళించాలని డ్రాగన్ కుట్ర
విదేశాల్లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు
21 దేశాల్లో 31 స్టేషన్లతో చైనా నిఘా
చైనా వ్యతికేతను తగ్గించేందుకు ఎత్తులు
ప్రపంచ పెద్దన్న కావాలన్న పిచ్చి ఆలోచనలు
సేవ చేస్తున్నామంటూ పైపెచ్చు కవరింగ్‌లు

ప్రపంచవ్యాప్తంగా చైనా చట్టవిరుద్ధంగా పోలీసు స్టేషన్లను తెరుస్తోందంటూ అంతర్జాతీయ నివేదికలు గగ్గోలుపెడుతున్నాయ్. కెనడా అంతటా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోతో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. చైనా విరోధులను నిరోధించడానికి ఈ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదగాలనే తపనతో, చైనా ప్రభుత్వం కెనడా, ఐర్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల చట్టవిరుద్ధంగా పోలీసు స్టేషన్‌లను ప్రారంభించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఆందోళనలు విన్పిస్తున్నాయ్. కెనడా అంతటా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోకి అనుబంధంగా… అనధికారిక పోలీసు సర్వీస్ స్టేషన్లు చైనా ఏర్పాటు చేస్తోంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టికా ఈ విషయాలను వెల్లడించింది.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఫుజౌ కెనడా అంతటా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోకి అనుబంధంగా అనధికారిక పోలీసు సేవా స్టేషన్లను ఏర్పాటు చేసింది. వీటిలో కనీసం మూడు స్టేషన్లు గ్రేటర్ టొరంటో ప్రాంతంలోనే ఉన్నాయంటూ ఊహించవచ్చు. చైనా ప్రభుత్వం ఈ అక్రమ పోలీస్ స్టేషన్ల ద్వారా కొన్ని దేశాల్లో ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తోందని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టికా పేర్కొంది. 21 దేశాల్లో ఇప్పటికే 30 స్టేషన్లను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, UK వంటి దేశాలు చైనీస్ పోలీస్ స్టేషన్‌లను ఏర్పాటు చేసుకున్నాయ్. ఆయా దేశాల్లో చైనా గురించి గొప్పగా ప్రచారం చేయడంతోపాటు… ఎవరైనా చైనా గురించి విమర్శిస్తే వారి సంగతి తేల్చాలన్న ఉద్దేశం ఉన్నట్టు కన్పిస్తోంది. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన గురించి అనేక మంది బాధితులు పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రశ్నించడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది.

చైనాలోని అధికార కమ్యూనిస్ట్ పార్టీ భద్రత పేరుతో దేశవ్యాప్తంగా విస్తృతంగా దుర్వినియోగానికి పాల్పడుతోందని, ప్రజలను నిర్బంధ శిబిరాలకు నిర్బంధించడం, కుటుంబాలను బలవంతంగా వేరు చేయడం, బలవంతంగా స్టెరిలైజేషన్ చేస్తోందని దుయ్యబడుతున్నారు. ఐతే ఇవన్నీ కూడా వొకేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్స్ అంటూ గొప్పలు పోతోంది. చేసేది గూఢాచార్యం… కానీ దానికి ముద్దుపేరు మాత్రం ట్రైనింగ్. అతివాద పోకలను అణిచివేయడంతోపాటు… ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచడానికి ఈ ఏర్పాట్లు అవసరమంటోంది. చైనా ఏర్పాటు చేసిన సెంటర్లలో ఎందరో శిక్షణ పొంది పట్టభద్రులయ్యారంటోంది. చైనాపై వస్తున్న విమర్శలను పరిశీలించేందుకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ మిచెల్ బాచెలెట్ ఇటీవల చైనా జింజియాన్‌లలో పర్యటించారు. ఆందోళనలపై చైనాను హెచ్చరించారు.