స్విమ్స్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి
తిరుపతిలో తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 6 గురు చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పద్మావతి మెడికల్ కాలేజీలో ఉన్న బాధితులను పరామర్శించి, అనంతరం స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. అంతకు ముందు తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. నగరంలోని బైరాగి పట్టెడ ప్రాంతం వద్ద ఘటనకు గల కారణాలు, ప్రభుత్వ సహాయ కార్యక్రమాల గురించి ఆరా తీశారు.

