రికార్డు సృష్టించిన చెన్నై కింగ్స్
ఐపీఎల్ 2025 సీజన్‌కు రంగం సిద్ధమైంది. మార్చి 22న 18వ ఎడిషన్ మొదలుకాబోతోంది. ఇప్పటికే అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ దూకుడు పెంచాయి. అయితే, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో అద్భుత రికార్డ్ నమోదైంది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఒక అరుదైన ఘనతను సాధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 17 మిలియన్ల మంది ఫాలోవర్ల మైలురాయిని చేరుకుంది. దీంతో ఇలా చేసిన మొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జట్టుగా నిలిచింది.మైదానంలో ఆడటం, స్థిరమైన ప్రదర్శన ఇవ్వడం విషయానికి వస్తే మెన్ ఇన్ ఎల్లో ఎల్లప్పుడూ ఆధిపత్యం చూపిస్తుంటారు. దిగ్గజ ఎంఎస్ ధోని నాయకత్వంలో ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20లను గెలుచుకున్న చెన్నై టీం.. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచింది.

