చెన్నై కిడ్నాప్ ముఠా మూలాలు పల్నాడు జిల్లాలో!
అంతఃరాష్ట్ర కిడ్నాప్ ముఠా సభ్యులు పల్నాడు జిల్లాకు చెందిన వారని తేలడంతో జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.చిన్నపిల్లను కిడ్నాప్ చేసి లక్షలాది రూపాయలకు విదేశాలకు అమ్మే ముఠా సభ్యులను చెన్నై పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.ఈ నెల 12న చెన్నై సెంట్రల్ స్టేషన్ సమీపంలో యాచకులుగా నటిస్తూ ఓ చిన్నారిని కిడ్నాప్ చేసింది ఈ మహిళా కిడ్నాపర్ ముఠా.వీళ్లంతా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలోని కొండకావూరు గ్రామానికి చెందిన మహిళలుగా గుర్తించారు.చెన్నై పోలీసులు పల్నాడు పోలీసులను అప్రోచ్ అయ్యి వారి వివరాలను తీసుకున్నారు.అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా న్యాయమూర్తి ఐదుగురు మహిళలకు రిమాండ్ విధించారు.

