Andhra PradeshHome Page SliderPolitics

జగన్ కేసుల ధర్మాసనం మార్పు

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కేసులు విచారణ జరుగుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనంలో మార్పులు జరిగాయి. ఇప్పటి వరకూ విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం స్థానంలో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చింది. ఈ ధర్మాసనంలో జగన్ బెయిల్ రద్దు, జగన్ కేసుల ట్రయల్ బదిలీ చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్లు ఉన్నాయి.