మంటల మిస్టరీగా మారిన చంద్రగిరి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శానంబట్ల అనే ఊరిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతున్నాయి. గత పది రోజులుగా ఎక్కడక్కడ మంటలు ఏర్పడుతున్నాయి. మొదట్లో ఎండల తీవ్రత వల్ల గడ్డి వాములు మండుతున్నాయి అనుకున్నారు కానీ, అకస్మాత్తుగా ఇళ్లలో, బీరువాలలో, పొలాల్లో మంటలు చెలరేగడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురి అవుతున్నారు. దీనితో గ్రామానికి అరిష్టం జరిగిందనుకొని, గ్రామదేవత గంగమ్మకు పూజలు చేస్తున్నారు ఊరివాళ్లు. అయితే ఈ పూజలు జరుగుతూండగానే మరో నాలుగిళ్లలో మంటలు చెలరేగడంతో నివ్వెరపోయారు. కొందరైతే ఇళ్లు కూడా ఖాళీ చేసి వెళ్లి పోయారు. పోలీసులు 50 మంది కలిసి గ్రామాన్ని పహారా కాస్తున్నారు. పోలీసులు ఉండగానే కొన్ని ఇళ్లలో మంటలు వస్తున్నాయి. ఫైర్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచి కాపలా కాస్తున్నారు పోలీసులు.

