News

చంద్రబాబు రాజకీయ జీవితమంతా అవినీతిమయమే: సజ్జల

స్కిల్ స్కాముకు దర్శకత్వం, స్కీప్ట్ అంతా చంద్రబాబుదే
లోకేష్ చర్యలు, దత్తపుత్రుడి హైడ్రామా ప్రజలను రెచ్చగొట్టేందుకే

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఏసీబీ కోర్టు తీర్పు పై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల స్పందించారు. “ఇది విజయమని మేము అనుకోవట్లేదు తప్పు చేసిన ఓ వ్యక్తిని సీఐడీ విచారణ చేసి కోర్టులో నిలబెట్టింది. ఇందులో రాజకీయ కక్ష్య ఏ మాత్రం లేదు. కోర్టులో చంద్రబాబు తప్పు చేయలేదనే నిరూపించాలి. సానుభూతి డ్రామాలు కాదు చేయాల్సింది.”- సజ్జల.

ప్రజా శ్రేయస్సు కోసం జగన్.. ప్రజా సొమ్ము కోసం బాబు

మనం ప్రజలకి జవాబుదారులం అని నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అయితే, దానికి పూర్తి విరుద్ధం చంద్రబాబు నాయుడని సజ్జల ధ్వజమెత్తారు. మళ్ళీ ఇలాంటి స్కాం జరగకూడదనే తాము బలంగా ప్రజల తరుఫున కోరుకున్నాట్లు తెలిపారు. మేము చంద్రబాబు వయసుకి గౌరవం ఇచ్చి హెలికాప్టర్ ఏర్పాటు చేశారని, కానీ చంద్రబాబు అధికారుల మాట వినకుండా పబ్లిసిటీ కోసం రోడ్డు మార్గాన్ని ఎంచుకోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని సజ్జల పేర్కొన్నారు. గంటలో విజయవాడ రావాల్సి ఉంది ఆయన వయసుకు మర్యాద ఇచ్చి ప్రభుత్వం వ్యవహారించిందని అన్నారు. తప్పు చేసిన చంద్రబాబు తాను చట్టానికి అతీతుడు అన్నట్లు మాట్లాడారని, నన్నెవరు అరెస్టు చేస్తారనే పొగరుతో చంద్రబాబు ఉన్నారని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబు వ్యవస్థ లో ఓ చీడ పురుగని దుమ్మెత్తిపోశారు. ప్రజాస్వామర్యంలో తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదని అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా అవినీతిమయమే అని, ఈ స్కిల్ స్కాం రూపకర్తి చంద్రబాబే అని దుయ్యబట్టారు.

కొడుకు, దత్తపుత్రుడి ఓవర్ యాక్షన్

చేసిన తప్పుకు తలదించుకోవాల్సిందిపోయి లోకేష్ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని సజ్జల విమర్శించారు. దత్తపుత్రుడు అర్ధరాత్రి రోడ్ల పై హైడ్రామా క్రియేట్ చేశారని ఇది శాంతిభద్రతలను భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు.