Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsNews AlertPoliticsTrending Todayviral

జగన్ ఎఫెక్ట్ దిగ్గొచ్చిన చంద్రబాబు… !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాడి వేడి చర్చకు దారితీస్తున్న అంశం ఇప్పుడు తోతాపురి మామిడి రైతులే. ఈ సంవత్సరం విపరీతమైన ఉష్ణోగ్రతలు, అనూహ్యంగా పండిన దిగుబడి కారణంగా మామిడికి మార్కెట్ డిమాండ్ పడిపోయింది. దాంతో భారీ నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం, వారి సమస్యలు నేరుగా విని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తరువాత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు తోతాపురి మామిడి మార్కెట్‌లో నెలకొన్న సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది . సీఎం ఆదేశాల మేరకు మామిడి రైతుల సంక్షేమం కోసం రూ. 260 కోట్లను విడుదల చేసినట్లు ప్రకటించారు.ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని ప్రాసెసింగ్‌ యూనిట్లు కొనుగోలు చేయనున్నాయి. దీనికి గాను రోజుకు రూ. 4 సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. ఈ నిర్ణయం మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో నష్టపోయిన రైతులకు గణనీయమైన ఊరట లభించనుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వేలాది మంది రైతులు ఈ సబ్సిడీ ద్వారా లబ్ధి పొందనున్నారు.రైతులకు అందే సబ్సిడీ నిధులను ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. రైతులు తమ ఖాతాల వివరాలను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. మద్దతు ధరతో పాటు ఈ ప్రత్యక్ష నిధుల జమతో రైతుల ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ధరల స్థిరీకరణ పథకం కింద పూర్తి మద్దతు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రైతుల నష్టాలను నివారించేందుకు కేంద్రంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, తోతాపురి మామిడి కొనుగోళ్లు ఆగస్టు 2025 వరకు కొనసాగుతాయి. ప్రాసెసింగ్ సంస్థలు కనీసం రూ. 8 నుంచి రూ. 12 వరకు మద్దతు ధరగా చెల్లించాలని ప్రభుత్వం సూచించింది.