‘’గేమ్ ఛేంజర్’’ సెకండ్ సాంగ్ వచ్చే ఛాన్స్ 27…
రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” సినిమా విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుండి ఇక వరుస అప్‌డేట్స్ ఉంటాయని మేకర్స్ ఆల్‌రెడీ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సెప్టెంబర్‌లోనే రెండో సాంగ్‌ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ, ఈ నెలలో ఇప్పటికే ఆఫ్ మంథ్ అయిపోయింది, ఇంకా దీనిపై ఇంకా ఏమీ క్లారిటీ లేదు.
అయితే రీసెంట్ గానే థమన్ తర్వాత వారంలో సాంగ్ రిలీజ్ ఉంటుంది అని తెలిపాడు. అయితే ఇప్పుడు ఈ డేట్‌పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ సాంగ్ సెప్టెంబర్ 27న వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే దానికి ఓ రెండు, మూడు రోజులు ముందు ప్రోమోని విడుదల చేస్తారుట. మరి ఈ సాంగ్ కోసం అయితే మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ఈ సాంగ్‌కి ఫ్యాన్స్ నుండి ఎలాంటి స్పందన రానుందో వెయిట్ అండ్ సీ.