Home Page SliderTelangana

ముధోల్ లో చైన్ స్నాచింగ్..

నిర్మల్ జిల్లాలోని ముధోల్ బైపాస్ రోడ్డులో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద పట్టపగలే చైన్ స్నాచర్ హల్ చల్ చేశారు. ఇంటి బయట బీడీలు చేసుకుంటున్న ఓ మహిళ మెడలో నుండి 3 తులాల బంగారాన్ని చైన్ స్నాచర్ లాకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ చైన్ స్నాచర్ లను పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు.