తెలంగాణ సర్కారుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్
ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై కేంద్రం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత జూన్‌లో కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటించాయి. దారి మళ్లించిన 152 కోట్ల రూపాయలను రెండ్రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ సర్కారుకు నోటీసులు అందాయి. కేంద్ర అనుమతి లేని పథకాలకు నిధులను మళ్లించినట్టు కేంద్ర బృందాలు గుర్తించాయి. ఉపాధి హామీ పథకం అమలు, పనుల కేటాయింపులో అనేక అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఒకవేళ ప్రభుత్వం తక్షణం ఆ నిధులను చెల్లించకుంటే.. తర్వాత చెల్లించాల్సిన వాయిదాలను నిలిపివేయొచ్చని తెలుస్తోంది.