కేంద్ర క్యాబినేట్ కీలక నిర్ణయం
నేడు కేంద్ర క్యాబినేట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. రైల్వే భూముల విధానంలో కొన్ని సవరణలు చేసింది. అంతేకాకుండా రైల్వే భూమి లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. కౌలు కాలాన్ని కూడా ఐదేళ్ళ నుండి ముప్పై ఐదేళ్ళు పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ నూతన విధానం ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి అనురాగ్ చెప్పారు. దాదాపు 1.2 లక్షల మందికి దీని ద్వారా ఉపాధి లభించనున్నట్టు , మరోవైపు రైల్వేలు కూడా ఎక్కువ ఆదాయాన్ని పొందుతాయని పేర్కొన్నారు.

