మహిళలలో జుట్టు ఊడడానికి కారణాలు-పరిష్కారాలు
మారుతున్న ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా పురుషులతో పాటు మహిళలు కూడా చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో ప్రధానంగా జుట్టు ఊడిపోవడం మహిళలను తీవ్రంగా వేధంచే సమస్య. దీనికి ముఖ్య కారణం ఒత్తిడి, ఆందోళనలుగా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో జరిగిన ఒక సర్వే ద్వారా 3 లక్షల మందిపై చేసిన అధ్యయనం కారణంగా ఈ విషయం తెలిసింది. ఈ సర్వేలో దాదాపు 72 శాతం మందికి జుట్టు రాలడం తీవ్రమైన సమస్యగా చెప్పారు. నేటి కాలలం పురుషులతో సమానంగా పని చేస్తున్న మహిళలకు ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. దీనికోసం సరైన వ్యాయామం చేయడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా కొంత వరకూ ఉపశమనం లభిస్తుంది. జుట్టుకు సరైన పోషణ అందించే ఆహారం తీసుకోవడం, కెమికల్స్ లేని షాంపూలు వాడడం, శిరోజాలు పొడిబారకుండా చూసుకోవడం, వెచ్చటి కొబ్బరినూనెతో మాడును మర్థనా చేయడం వంటి చర్యల ద్వారా శిరోజాలు రాలడాన్ని కొంత వరకూ అరికట్టవచ్చు.