గౌతం ఆదానిపై అమెరికాలో కేసు
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం ఆదానిపై అమెరికాలో కేసు నమోదైంది.న్యూయార్క్ ఫెడరల్ కోర్టు ఈ మేరకు వారెంట్ కూడా జారీ చేసింది. నిధుల సేకరణలో భాగంగా సోలార్ ప్రాజెక్ట్ దక్కించుకోవడం కోసం 265 మిలియన్ డాలర్లు( రూ.2,120 కోట్లు) లంచం ఇవ్వజూపారనే ఫిర్యాదు మేరకు ఆయనపై ఈ కేసు నమోదైంది. ఆదానితో పాటు అతని మేనల్లుడు సాగర్ ఆదాని సహా మొత్తం 8 మంది పై అమెరికాలో కేసు నమోదైంది. దీంతో ఒక్కసారిగా ఆదాని షేర్లు కుప్పకూలాయి.షేర్లన్నీ లోయర్ సర్క్యూట్ లను తాకి అతలాకుతలం అయిపోయాయి.

