పంజాగుట్టలో హోంగార్డు పైకి దూసుకెళ్లిన కారు
తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఊహించని షాక్ ఎదురైంది. హైద్రాబాద్‌లోని పంజాగుట్టలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అక్కడి సిబ్బంది ఓ కారుని ఆపబోయారు.కానీ సినీ ఫక్కీ తరహాలో అటూ ఇటూ తిరుగుతూ చివరకు పోలీసులపైకే దూసుకొచ్చింది.అదుపుతప్పో లేదా లెర్నింగ్ డ్రైవరో అని తొలుత పొరబడ్డారు.కానీ హోంగార్డుని సైతం ఈడ్చుకుంటూ వెళ్లింది.కారు డ్రైవర్ సృష్టించిన బీభత్సం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్దేశ్యపూర్వకంగానే పోలీసులపైకి వాహనాన్ని పోనిచ్చినట్లు విచారణలో వెల్లడైంది.నిందితుడు పరారీలో ఉన్నాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.