లక్డీకాపూల్ లో కారు బీభత్సవం – 11 మందికి గాయాలు
హైద్రాబాద్‌లోని లక్డీకాపూల్ నీలోఫర్ కేఫ్ దగ్గర ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. అదుపుతప్పి పార్క్ చేసిన వాహనాలపైకి దూసుకెళ్లింది.అంతేకాదు ఏకంగా జనావాసాల్లోకి దూసుకొచ్చేసింది.దీంతో ఆయా ప్రాంతాలకు అవసరాల కోసం రాకపోకలు సాగించేవారు ఈ ప్రమాద బారీన పడ్డారు. మొత్తం 11 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. చాలా మందిని ఆ కారు ఈడ్చుకుని వెళ్లింది .కొంత మంది పరిస్థితి విషమంగా మారింది.ఇది గమనించిన డ్రైవర్ కారు దిగి పారిపోతుండగా ..స్థానికులు వెంబడించి పట్టుకుని చితకబాదారు.నిందితుణ్ణి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.