‘క్రిస్మస్ షాపింగ్‌లో కారు బీభత్సం’..70 మందికి గాయాలు
జర్మనీలో మాగ్డేబర్గ్‌లో ఒక కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి సమయంలో ప్రజలు క్రిస్మస్ పండుగ సందర్భంగా మార్కెట్‌లో షాపింగ్ చేసుకుంటుంటే ఒక కారు ప్రజలపై దూసుకువచ్చింది. అతి వేగంగా వచ్చి 400 మీటర్లు మార్కెట్లో దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 70 మంది గాయపడగా, ఒక పసిబిడ్డతో సహా ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణమైన సౌదీ అరేబియాకు చెందిన డాక్టర్ తలేబ్ (50) అనే వ్యక్తిని జర్మన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బీఎమ్‌డబ్ల్యూ కారును అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై జర్మన్ ప్రభుత్వం మండిపడింది. ఈ హింసను ఖండిస్తున్నామని, బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రకటించింది. ఈ ఘటనపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మండిపడ్డారు. జర్మన్ ఛాన్సలర్ రాజీనామా చేయలని డిమాండ్ చేశారు. అయితే జర్మనీ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.