ఇక ఫ్రీగా చూడలేరు..
రిలయన్స్ కు చెందిన జియో సినిమా డిస్నీ+ హాట్ స్టార్ లు ఒక్కటయ్యాయని సంగతి తెలిసిందే. జియో హాట్ స్టార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చిన జియో హాట్ స్టార్ ఐపీఎల్ లవర్స్ కు చేదు వార్త చెప్పింది. ఇకపై జియో హాట్ స్టార్ లో ఐపీఎల్ మ్యాచ్ లు ఫ్రీగా చూడటం కుదరదని, మ్యాచ్ చూడాలంటే కచ్చితంగా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. జియో సినిమాలో ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్ లు ఫ్రీగా వీక్షించే అవకాశం ఉండేది. అయితే.. జియో హాటోస్టార్లో ఐపీఎల్ మ్యాచ్ మొదట్లో కొన్ని నిమిషాలు మాత్రమే ఫ్రీగా చూసే అవకాశం ఇవ్వనున్నారు.