ట్రంప్ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉండొచ్చా..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై ఉండొచ్చనే అనుమానాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లియర్ చేశారు. ఆర్థిక వ్యవస్థపైనా పరోక్షంగా ఉండే అవకాశం ఉన్నదని నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే అది ఏ స్థాయిలో ఉంటుందనేది ప్రస్తుతానికి అంచనా వేయలేమని చెప్పారు. తాము ఎంతో అప్రమత్తంగా ఉన్నామని వివరణ ఇచ్చారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని వివరించారు. కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఎలాంటి ఆందోళన చెందడం లేదన్నారు నిర్మలా సీతారామన్. మనం సేవల రంగంలో బలంగా ఉన్నామని, సాఫ్ట్ వేర్, ఏఐ, స్టెమ్ ఆధారిత పరిశోధనల పరంగా భారత్ స్వదేశీ సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు. మన బలాలేంటో మనకు తెలుసని చెప్పారు.