10 కోట్ల పారితోషకం వదులుకున్న బన్నీ
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదు. పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా తర్వాత పాపులారిటీ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఆ పాపులారిటీని చాలా వాణిజ్య సంస్థలు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి. దీనితో తమ వాణిజ్య ప్రకటనలలో ఆయనను చూపించాలని తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. బన్నీ కూడా షూటింగ్ విరామాలలో జోరుగా యాడ్స్ చేస్తూ భారీ పారితోషకం వసూలు చేస్తున్నారు. గత కొన్ని రోజులులగా వరుసగా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. ఇప్పటికే కూల్‌డ్రింక్, రెడ్‌బస్, స్కూటర్ మొదలైన యాప్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నారు. వాటికోసం సుమారు ఒక్కొక్క యాడ్‌కి 7కోట్ల పైచిలుకే రాబడుతున్నారు. అయితే 10 కోట్లు ఆఫర్ చేసిన ఓ వాణిజ్య ప్రకటనను బన్నీ వదులుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విషయం ఏమిటంటే అది పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటన. తాను అలాంటి ప్రకటనలు చేస్తే తన అభిమానులు తనను చూసి వాటికి అలవాటు పడతారేమోనని తాను ఆ ప్రకటన చేయనని అన్నారట. అభిమానుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షం వెల్లిబుచ్చుతున్నారు. ఇప్పుడు పుష్ప- 2 పనుల్లో బిజీగా ఉన్నారు బన్నీ.