నడిరోడ్డుపై యువకుని దారుణ హత్య
పట్టపగలు…నడిరోడ్డుపై ….ఓ యువకుణ్ణి గుర్తుతెలియయని దుండగులు అతిదారుణంగా హత్య చేశారు.ఈ హత్య జరిగేటప్పుడూ అంతా చూస్తూ…నిశ్చేష్టులయ్యారు.అంతే తప్ప..అటకాయించే సాహసం కూడా చేయలేకపోయారు. హంతకులు గొడ్డలి,కత్తులతో కసి తీరా పొడిచి చంపేశారు.హత్య చేసి నింపాదిగా రోడ్డు దాటుకుంటూ వెళ్లిపోయారు.ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉమేష్(25) అనే వ్యక్తిని దారి కాచి అడ్డగించి చంపేశారు. అటుగా వెళ్తున్న వారు దూరం నుంచి వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు.


 
							 
							