బాలుడి దారుణ హత్య
సత్యసాయి జిల్లా మడకశిరలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న చేతన్ అనే బాలుడిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేశారు దుండగులు. బాలుడు కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రోజే కర్ణాటక సరిహద్దుల్లో మృతదేహం లభ్యం కావడం సంచలనం కలిగించింది. సీసీ టీవీ ఫుటేజ్ వీడియోలలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తూ బాలుడిని బండి ఎక్కించుకుని వెళ్లినట్లు కనిపించింది. ఈ వీడియోల ఆధారంగా కిడ్నాపర్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. బాలుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఈ వార్త తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.