Home Page SliderTelangana

బీజేపీలో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి!

తెలంగాణ: హైదరాబాద్ ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు బీఆర్ఎస్ టిక్కెట్ కేటాయించకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారు. కాగా, ఇప్పటివరకు ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి సీటు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.