Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

అసెంబ్లీ నుండి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సస్పెన్షన్

జగదీశ్ రెడ్డి స్పీకర్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నేడు సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగాన్ని చాట్ జీపీటీ ఏఐ వాటి తయారు చేశారని ఆరోపించారు. ‘‘ఈ సభ మనందరిది.. ఇక్కడ అందరికి సమాన హక్కు ఉంటుంది. అసెంబ్లీ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక్కరిదే కాదు. మా అందరి తరుఫున పెద్ద మనిషిగా స్పీకర్‌గా మీరు కూర్చొన్నారు.. ఈ సభ మీ సొంతం కాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఫైర్ అయ్యారు. దళిత స్పీకర్ ను అవమానిస్తారా..? ఆయన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో సభలో తీవ్ర దుమారం రేగడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం మంత్రి సీతక్క సూచనల మేర జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారు స్పీకర్.