Home Page SliderTelangana

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి హైకోర్టులో ఊరట

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆమె ఎన్నిక చెల్లదని ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యామ్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లో కోవా లక్ష్మి తప్పుడు సమాచారం ఇచ్చారని అజ్మీరా శ్యామ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచిందని ఆరోపించారు. ఇరువర్గాల వాదన విన్న కోర్టు శ్యామ్ పిటిషన్ ని కొట్టివేసింది. గత అసెంబ్లీ ఎన్నిక 22,798 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ పై కోవా లక్ష్మి గెలుపొందిన సంగతి తెలిసిందే.